best jokes in telugu
Jokes

Best jokes in telugu

మూడవ తరగతి చదువుతున్న కుర్రాడుమేడం ని తెగ ఇబ్బంది పెడుతున్నాదు. “మేడం నా అక్కయ్య నాల్గవ తరగతిలో చదువుతుంది. నేను తనకన్నా తెలివైనవాణ్ణి. కాబట్టి నన్ను కూడ నాల్గవ తరగతిలో చేర్చండి” అనేది వాడి వాదన. విసిగి పోయిన మేడం కుర్రాడి గోల భరించలేక వాడిని ప్రిన్సిపాల్ చేంబర్ కి తీసుకెళ్ళింది. జరిగిందంతా విన్న తరువాత ప్రిన్సిపాల్ కుర్రాడికి చిన్న పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.”3 3 ఎంత?” అడిగాడు ప్రిన్సిపాల్. “ఆరు” జవాబిచ్చాడు కుర్రాడు. “6 6 ఎంత?” మళ్ళి అడిగాడు ప్రిన్సిపాల్. “పన్నెండు” కుర్రాడి జవాబు. ఇలా కొన్ని ప్రశ్నలడిగాక సంతృప్తి చెందిన ప్రిన్సిపాల్ కుర్రాడిని నాల్గవ తరగతికి పంపించవచ్చని ఒప్పుకున్నాడు. అయితే మేడం నేను కూడ కొన్ని ప్రశ్నలు అడుగుతాననిచెప్పి కుర్రాడ్ని అడగటం ప్రారంభించింది.
మేడం: అవుకు నాలుగుండి, నాకు రెండే ఉండేవేవిటి?
కుర్రాడు: కాళ్ళు
మేడం: నీ ప్యాంట్ లో ఉండి నా దగ్గర లేనిదేవిటి?
కుర్రాడు: జేబులు
మేడం: ఇంగ్లీష్ లో ‘సి’ అక్షరం తో మొదలయ్యి ‘టి’ అక్షరం తో అంత్యమై…. జుట్టుండి, రుచిగా లోన తడి తడిగా ఉండేదేవిటి?
కుర్రాడు: కోకోనట్
మేడం: లోపలికి వెళ్ళేటప్పుడు గట్టిగా, లేత ఎరుపు రంగులో ఉండి బయటకొచ్చేటప్పుడు మెతకబడి తడిసుండేదేవిటి?
కుర్రాడు: చ్యూయింగ్ గమ్
మేడం: నువ్వు నాలోకి కడ్డీని దూరుస్తావు. నన్ను కట్టేసి లేపుతావు. నీకంటే ముందు నేను తడుస్తాను. నేనెవర్ని?
కుర్రాడు: టెంట్
మేడం: నువ్వు నాలోకి వేలు దూరుస్తావు. తోచనప్పుడు వేలు తిప్పుతావు. ప్రతి మగాడికి ఇది కావల్సిందే. ఏవిటది?
కుర్రాడు: నిశ్చితార్ధం నాడు తొడిగే ఉంగరం
ప్రిన్సిపాల్ ఏవీ పాలుపోక దిక్కులు చూడడం మొదలెత్తాడు.
మేడం: వేరు వేరు కొలతల్లో ఉంటాను. నలతగా ఉంటే తడుస్తాను. గట్టిగా ఊదితే సేదతీరుతాను. నేనెవర్ని?
కుర్రాడు: ముక్కు
మేడం: పదునైన మొనతో ఉండి గట్టిగాగుచ్చుకుంటాను. శబ్దం చేస్తూ దూసుకెళ్తాను. నా పేరేవిటి?
కుర్రాడు: బాణం
మేడం: ‘ఎఫ్’ అక్షరం తో మొదలై చివర ‘కె’ అక్షరం ఉండే ఇంగ్లీష్ పదం. సరిగ్గ కుదరక పోతే చేతిని వాడుతారు.
కుర్రాడు: ఫోర్క్
మేడం: మగాళ్ళందరికీ ఉండేది. కొందరిది పొడుగ్గా, కొందరిది పొట్టిగా. పెళ్లి తరువాత పెళ్ళానికి ఇచ్చేది?
కుర్రాడు: ఇంటి పేరు
మేడం: మగాడిలో ఉండే ఓ అంగం. కండరాలు, నరాలు తప్ప ఎముకలుండవు.ఆడదాన్ని ‘ప్రేమించదంలో’ దీని పాత్ర గొప్పది?
కుర్రాడు: హృదయం
ప్రిన్సిపాల్ నిట్టూరుస్తూ మేడంతో చెప్పాడు. “ఈ కుర్రాడ్ని ‘యూనివర్సిటీ’కి పంపించండి. మీరడిగిన అన్ని ప్రశ్నలకూ నేను తప్పు జవాబులు ఊహించాను!”

Narayana
Narayana Velagala is Full-time Employee in IT sector and versatile in a job. basically, he is a Digital marketing executive and professional SEO trainer. he is also a content writer and mostly writes blogs for business articles
http://ecombunch.com